పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0360-4 కాంబోది సంపుటం: 11-358

పల్లవి: చాలు జాలుఁ దనిసితి సటలనె నేఁ డెల్ల
         తాలిమి నిందుకై నిన్నుఁ దప్పక చూచేను

చ. 1: నేయ రానిచేఁత లెల్లఁ జేసి వచ్చి నీవు నన్ను
       పాయిని చుట్టమువలెఁ బై కొనేవు
       కాయకపువారికె కాని లే వీ వినయాలు
       వొయమ్మ నిన్నే మనే నూరకుండేఁ గాక

చ. 2: చిత్త మెక్కడనో పెట్టి చేరి నాతో మాయలకు
       బిత్త గలవానివెల పలికే విదే
       హత్తి గాయగంట్లె కాని అంతేసి నేరరు
       యిత్తల నెట్టు పూఁకొందు నిట్టె నవ్వేఁ గాక

చ. 3: తేరకల్లె నెవ్వతెనో తెచ్చి యాపెచేత నాకు
       చేరికొనఁ బెట్టి సేవ సేయించేవు
       నేరుపు శ్రీవెంకటేశ నీకె కాని లేదు
       సారెనన్నుఁ గూడితివి సమ్మతాయ నిదివో