పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0360-3 వరాళి సంపుటం: 11-357

పల్లవి: ఎరవులదానివలె నెందు వొయ్యేవే ఆత
         నిరవులు వెదకవే యేమి సేసివో

చ. 1: కంకణాల చేతుల కదల నూఁచుకొంటాను
       యింకనిచెమటలతో నెందు వొయ్యేవే
       అంకెల నీయింటికి నాతఁడె విచ్చేసె
       యింకా రాఁడా వెర గయ్యీ నెంతఁ బోయనో

చ. 2: సెలవుల నవ్వుకొంటా చెంపలఁ దురుము జార
       యెలమి నసురుసు రై యెందు వొయ్యేవే
       కొలఁది లేనిసొమ్ములు కొంట వచ్చె నీకు నిట్టె
       యెలయించి నాతోఁ జెప్పి యేడ నున్నాఁడో

చ. 3: బంగారు పాదాలతోడ పట్టుచీర కొంగ జార
       యింగితాల గాన రాఁగా నెందు వోయ్యేవే
       అంగన శ్రీవెంకటేశుఁ డప్పుడె నిన్నుఁ గూడెనో
       రంగై నీ వెంటనె వచ్చే రాఁపుల వీఁడు గదే