పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0360-2 కేదారగౌళ సంపుటం: 11-356

పల్లవి: ఏల నిలువఁ బెట్టేవు యింతేసి వలపులు
         పోలికలు గాన రాదా పోయనందుకే

చ. 1: ఆన వెట్టేవు నామీఁద నక్కర గల నంటాను
       కాని కాని అందు కేమి కడమా నేఁడు
       యీనిజము లెంచఁ బోతే యీరుదియ్యఁ బేనువచ్చు
       వోరి నన్ను గుట్టుతోనె నూరకుండ నియ్యరా

చ. 2: తారుకాణించ వచ్చేవు తలఁతు న న్నంటాను
       సారె సారె నందు కేమి చాలదా నేఁడు
       మారుబాణము లెంచితే మంచముకిందే నుయ్యి
       నేరుపుతోఁ బరాకున నెత్త మాడ నియ్యరా

చ. 3: పులకలే చూపేవు పోంది కరఁగితి నంటా
       తలతల అందు కేమి తగదా నేఁడు
       యెలమితో శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
       పలుకుఁబంతము చెల్లె భావించుకో నియ్యరా