పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0360-1 ముఖారి సంపుటం: 11-355

పల్లవి: బాపు బాపు జాణ గదే బావఁగారు
         కోపగించీ నోప నంటే గోల బావఁగారు

చ. 1: చనవు సేసుక నాతో సారె సారె నవ్వీని
       పని లేదు తన కేమి బావగారు
       వినరె మాటల నుప్పు వేసి పొత్తు గలసీని
       పెనఁగి యెక్కడ నైనా పెద్దబావఁగారు

చ. 2: నయమున నా యెదుట నన్నుఁ బేరుకొని పాడి
       బయలు వందిలి వెట్టీ బావఁగారు
       ప్రియముతో మంచ మెక్కీ పిలివని పేరంటము
       లయకాఁడు గదవే తొలఁగుబావఁగారు

చ. 3: సులభానఁ దానె మెచ్చి సోమ్ము లెల్లా మెడఁ గట్టీ
       బలిమికాఁడు గదవే బావఁగారు
       తొలఁగక నన్నుఁ గూడి దొరకోలు సేసుకొని
       చెలఁగీ శ్రీవెంకటాద్రి చిన్నబావఁగారు