పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0359-6 ఆహిరి సంపుటం: 11-354

పల్లవి: అప్పుడువో నన్నుఁ జూచే దంతా నీవు
         చెప్పక నీవు దాఁచినచెలిఁ గంటేఁ గాని

చ. 1: చెప్ప రాదు గాని నా చిత్తములోని చింత
       వుప్పతిల్తి వున్నది నా వొళ్లఁ జూడరా
       కప్పురానాఁ బోదు చల్లగాలిచేతా నారదు
       తప్పదు నిన్ను రానీనిదానిఁ గంటేఁ గాని

చ. 2: చూప రాదు గాని నా చుట్టుకొన్నతమకము
       ఆఁప రానినిట్టూరుపు లందుఁ జూడరా
       తీపుల మాటలఁ బోదు తేటల వెన్నలఁ బోదు
       తాపి యై నిన్ను బోదించేదానిఁ గంటేఁ గాని

చ. 3: యెంచ రాదు గాని నా యీరసపుఁ జలములు
       యించుక నా కాఁగిటిలో నిదె చూడారా
       ముంచిన శ్రీవెంకటేశ మూసి మంతనాలఁ బోదు
       అంచెల నీ మేలుదాని నట్టెకంటేఁ గాని