పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0359-5 మంగళకౌశిక సంపుటం: 11-353

పల్లవి: ఇప్పుడె సవతితన మేరుపడె నాకు నేఁడు
         తప్పులేదు యిఁక నన్నుఁ దడవక పోవే

చ. 1: ఆతఁడె నీమీఁదిబత్తి అవు నట యిఁక నీవు
       యీతల వెంగెము లాడి యేమి సేసేవే
       కాతరాన మా గుట్టు కడు బయట వేసితి
       భీతి వాసె నిఁక నీవు బీరము లాడకువే

చ. 2: వూరకె మా యింట నాతఁడున్నాఁ డంటా నాడేవు
       సారెకు నీవిఁక మరి సాదించే దేమే
       యీరీతి మా చలి వాపి యింత ఱట్టు సేసితివి
       తేరెఁ బను లన్నియును తెగ నాడేఁ బదవే

చ. 3: శ్రీవెంకటేశ్వరుడు నాకుఁ జేరి వొప్పగించితివి
       కావించి నీ వాడేనింద గట్టాయ లేవే
       వేవేగ నాతఁడు నన్ను విచ్చనవిడిఁ గూడెను
       దేవరే మేలు సేసె తెరమరఁ గేఁటికే