పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0359-4 సామంతం సంపుటం: 11-352

పల్లవి: నీవు విరహి వవుట నే నెరఁగనా
         భావించ యెవ్వ రవుతా నేర్పరచలేఁ గాని

చ. 1: కాఁకలు నీ మాటలోనె కాన రాదా నీ మేను
       సోఁకించి నా కప్పటిని చూప వలెనా
       యేఁకట నాకయిన దిన్ని యెవ్వతెకు నీ వైనది
       తేఁకువ నీ రెండూను తెలియలేఁ గాని

చ. 2: కరఁగులు నీ మోము కళలోనె కాన రాదా
       ఆర మరిచితి నంటా నాడవలెనా
       ధర నిది నా కవుత తగ వేరొకతె కవుత
       యిరవుగ నిది నిశ్యయించలేఁ గాని

చ. 3: కూటమి నీ కాఁగిటితో గురి సేయవలెనా నీ
       తేటలు ప్రియాలలోనె ద్రిష్టము గాదా
       మేఁటివి శ్రీవెంకటేశ మించి నన్నుఁ గూడితివి
       యాఁటదాటిపొందవుత అరయలేఁ గాని