పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0359-3 పాడి సంపుటం: 11-351

పల్లవి: మేలు మేలు రాఁగా రాఁగా మెచ్చితి నిన్ను
         కోలు ముందై యిందే కాక కొండకుఁ బొయ్యేవా

చ. 1: సంతసాన నేనీతో జరసి మాటడఁగాను
       పంతము దప్పీ నంటాఁ బలుకవు
       రంతుల నేఁడె నీకు రాజస మెంత గల్లాను
       కాంతలమీఁదనె కాక కడఁ జూపేవా

చ. 2: సలిగెతో నేనెంత నటలు సేసిన నీవు
       చలము దప్పీ నంటా సరి నగవు
       పెలుచుఁదనాన నీకు బీర మెంత గలిగినా
       చెలులమీఁదనె యింత సేయక మానేవా

చ. 3: యేపుననీ ముందటనె యెంత నిలుచుండినా నీ
       చూపు లరగీ నంటాఁ జూడ జాలవూ
       బాపుర శ్రీవెంకటేశ పచ్చిగాఁ గూడితి నన్ను
      నీ పొందు నాతోనె కాక నేఁడు మానేవా