పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0359-2 వరాళి సంపుటం: 11-350

పల్లవి: వాకిట కాతఁడు రాఁగా వద్దంటినా
         చేకొని నా కేల చేప్పేవే బుద్దులు

చ. 1: మన సాతనితగులు మాటలు నీతో తగులు
       వొనర నన్నే మనేవే వో చెలియ
       కనుచూపు లాతనిపై కాఁకలు నామేనిమీఁద
       పెనఁగీ నింకా నేల పెంచేవే దూరులు

చ. 2: సిగ్గు లాడ కంపితిని చెక్కుచేయి నాకు నిదె
       యెగ్గులు దప్పులు లేవు యే మనేవే
       దగ్గరెఁ దనపొరువు తాలిమి నాకుఁ గరవు
       నిగ్గుల నాపయి నేల నించేవే కోపము

చ. 3: ముంగిట నాతఁడున్నాఁడు మూల నున్నదాన నేను
       అంగడి కెక్కె వలపు లవుఁ గదవే
       రంగుగా శ్రీవెంటాద్రిరాయఁ డిట్టె నన్నుఁ గూడె
       సంగ తాయి నీ కోరికె చల మేలే యిఁకను