పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0359-1 శంకరాభరణం సంపుటం: 11-349

పల్లవి: అదివో నీ రమణుఁడు అలుగఁగఁ దరి గాదు
         యెదిటికి రావు లోన నేమి సేసేవే

చ. 1: చిలుక పావురము చెరకు శింగిణివిల్లు
       వలరాజు దాడి ముట్టె వసంతవేళ
       బలిమిఁ గోవిలకూఁత పరివారముల మోఁత
       యెలమి నదివో లోన నేమి సేసేవే

చ. 2: పొడవు మీను టెక్కెము పూవులయమ్ములపొది
       వెడలె వరుఁడు దండు విరహులపై
       యెడయని వెన్నలలు యెగయుఁ బౌఁజుల ధూళి
       యిడమఁ జింతతో లోన నేమి సేసేవే

చ. 3: చిగురుబజొంపపు జల్లి చిరుతగాలి ప్రధాని
        మగటిమిఁ గాముఁ డెక్కె మనసులపై
        తగిన శ్రీవెంకంటాద్రి దైవ మిట్టె నన్నుఁ గూడె
        యెగసక్కెమున లోన నేమి సేసేవే