పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0358-5 హిజ్జిజి సంపుటం: 11-347

పల్లవి: మంచవాని వలనె మాటలు నాడేవు గాక
         దించరాని తమకపు దేవరవు గావా

చ. 1: గుట్టున నెవ్వతెమీఁది కోపాన వచ్చి య దెల్ల
       వెట్టికి నింటివారిపై వెళ్ళించేవు
       దిట్ట నే నొకతెఁ గాఁగా దో కొంటిఁ గాక నీతో
       అట్టిపాటి యాఁట దెల్లా నండకు రాఁగలదా

చ. 2: బిగిసి యాడ నెవ్వతే పిలువనికాంతాళన
       నగుతా నెవ్వరే మనినాఁ దిట్టేవు
       అగపడి నేఁ గాఁగా నన్నియు నమరెఁ గాక
       నిగిడి వేరొక్క తై తే నీతోఁ బొందు సేసునా

చ. 3: ఆవల నెవ్వతెతోను అలిగినవాఁడవై
       కవ గూడి నన్ను నిట్టె కాఁక సేసేవు
       నవ మై శ్రీవెంకటేశ నాకె మజ్జాతి గాక
       నివిరి వేరొక్క తై తే నీతోఁ బిందు సేసునా