పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0358-4 శుద్దవసంతం సంపుటం: 11-346

పల్లవి: ఓరి పో యిదేడ సుద్ది వుండఁ బట్టదా వోసి
         వోరికొట్లు గొట్టఁగా వొద్దికి వచ్చితినే

చ. 1: గొల్లపిన్న వాఁడా గోవులఁ జక్కఁ గావరా
       యిల్లిదె మావాకిలి నీ వేల కాచేవు
       కల్ల గాదె నీమాట నేఁ గాచే ఆవులపాల
       చల్ల లమ్మఁ బోఁగానె పో సాదించ వచ్చితిని

చ. 2: బాలకృష్ణబోయిఁడా పసులు వల్లె వేయరా
       వాలుఁ జూపుల మ మ్మేల వల్లె వేసేవు
       నేలనుండి మాకోడెలు నీ యింటిచూరు మేసె
       తోలవైతి వందుకే పో దూరులు వేసితిని

చ. 3: నాలి శ్రీవెంకటేశుఁడ నాచన్ను లెల పట్టేవు
       చాలదా నీవు పసుల చను పట్టేది
       మేలిమి ఆవులవారి మెలుతలు మీరు గాన
       మూల నన్ను మీ చన్నులు ముట్టి నేఁ గూడితిని