పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0358-3 ఆహిరి సంపుటం: 11-345

పల్లవి: ఆఁటదానిపై నీ బలు వంతయునుఁ జూపేవా
         నాఁటెనా నీ ఆయములు నవ్వుల నా మాటలు

చ. 1: వాలుకరెప్పలు వంచి వడిఁ దప్పక చూచేవు
       వొలి నిందాఁక నేడ నుంటి వంటేను
       తాలిమి లే కప్పటికి తగఁ గసరుకొనేవు
       యేలని నెంజిరి వికం నెంతటాఁ దీరదురా

చ. 2: చేరి మారుమోముతోఁ బిల్చిన నాతోఁ బలుకవు
       మేర మీరే నీ గుణాలు మెచ్చే నంటేను
       దార దప్ప కందుకె తగఁ బంతా లాడేవు
       యేరా నా పై కోప మెంత నీ కున్నదిరా

చ. 3: కోక గట్టుక నాతోను కోరివాదుకు వచ్చేవు
        కైకొని నీ పరువులు గంటి నంటేను
       యేక మై యిట్టె శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
       యీడక నా గరిమెలు యెందు కైనా వచ్చురా