పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0358-2 ముఖారి సంపుటం: 11-344

పల్లవి: ఊరకె గుట్టు సేసుక వుండనీ వయ్య
         పేరఁ బెట్టినటువంటి పెరగె మాజరగు

చ. 1: గొల్లవారిమాఁటలు గోనుఁ బువ్వువాటులు
       కెల్లు రేఁచి మమ్ముఁ బలికించకు వయ్య
       కొల్లలాడే బాగులు గొడ్డుఁబుల్లతేగెలు
       నొల్లనొల్లమి విడే లుంగిటయ్యీ మాకును

చ. 2: చిత్తములో మంకులు చేతు కెల్లా అంకులు
       బత్తితో మమ్ము బలిమిఁ బట్టకు వయ్య
       గుత్త మైనమేడలు కొమ్మిమాకునీడలు
       కొత్త సున్నపుటిండ్ల కొర యాల మాకును

చ. 3: తొలుతే మా కాఁపురాలు తోఁపుతిత్తి దాఁపురాలు
        తిలకించి మా వొడి సోదించకు వయ్య
        నెల వైశ్రీవెంకటేశ నీవు మమ్ముఁ గూడితివి
        మొలకలపులకలు మోపు లాయ మాకును