పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-6 బౌళి సంపుటం: 11-342

పల్లవి: కూళతనమౌ బత్తి గొట్టమునఁ బెట్టఁ బోతే
         ఆలసించ కిఁక లేవె ఆకెతోఁ జెప్పుదము

చ. 1: వదలి మనసు రానివాని మాట లెన్నైనా
       పెదవులపైనె కాని ప్రియము లేదు
       యిదివో తారాఁ డట యీడ నుండ మన కేల
       ఆదనఁ బోదము రావె ఆకెతోఁ జెప్పుదము

చ. 2: ననుపు లేనివాని నగవు లెందాఁక నైన
       పని మాలుటే కాని ఫలము లేదు
       మనవు లడగఁ డట మనమే చెప్పఁగ నేల
       అనమానించక రావె ఆకెతోఁ జెప్పుదము

చ. 3: ఆరయ రాజసపువాఁ డాస లెన్ని వెట్టినాను
       పేరడి నుండుటె కాని పెనఁగ రాదు
       యీరీతి శ్రీవెంకటేశుఁ డింత చేసి చెలిఁ గూడె
       ఆరితేరె నా సుద్దులె ఆకెతోఁ జెప్పుదమూ