పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-4 మధ్యమావతి సంపుటం: 11-340

పల్లవి: పంతములే నెరుపేవు పలుమారును
         యెంత కెంత విచారించ కిది నీకుఁ దగునా

చ. 1: వీడ నాడేవు విభుని వీసమంత పని కైన
       తోడనె కొండవంటి దొర గాఁడా
       యేడ నైనా నీ వైతే నెకసక్కెమే సేసేవు
       జాడతో నీచే నాతఁడు సాదింపఁబడునా

చ. 2: చెలరేఁగే వది యేమే చేతికి లోనాయ నంటా
       వలపు నీమీఁదఁ గలవాఁడు గాఁడా
       సొలసి సొలసి వోరచూపుల జూచే వదేమే
       చలపాదితన మింత సతులకుఁ చెల్లునా

చ. 3: సిగ్గువడే విది యేమే చేయ నీపై వేసె నంటా
       యెగ్గు లేని శ్రీవెంకటేశుఁడు గాడా
       అగ్గ మై నీచిత్తము రా నన్నిట నాతఁడు గూడె
       కగ్గ దేరినందుమీఁదఁ గపటము చెల్లునా