పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-3 సామంతం సంపుటం: 11-339

పల్లవి: ఇంత చలము నీ కే లమ్మా
         కొంతయినఁ దెలుసుకో వమ్మా

చ. 1: అలుకలుఁ బులుకలు నాతనితోడను
       వలవని దేఁటికి వద్దమ్మా
       మొలకల నవ్వులు ముంచఁగ నీకిఁకఁ
       దల వంచు కొనఁగఁ దఁగ దమ్మా

చ. 2: పెనఁగులు జనుగులుఁ బెట్టేవు పిలువఁగ
       పని మాలినపని బలు వమ్మా
       చనవులు నీ పతి చల్లఁగ మరి యిఁక
       వెనకటిమంకులు విడ వమ్మా

చ. 3: అసురులు నుసురులు నందినకాఁగిట
       వసివాడులు నిఁక వలె నమ్మా
       యెసగిన శ్రీవెంకటేశుఁడు గూడెను
       పొసఁగె నిన్నియును భోగించ వమ్మా