పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0357-2 దేసాళం సంపుటం: 11-338

పల్లవి: ఎట్టు గెలువంగ వచ్చు నిటువంటివాని నిన్ను
         పట్టినచలముతోడ భ్రమలఁ బెట్టితివి

చ. 1: మంచిమాట లాడఁగానె మఱచితి నిన్నియును
       అంచెల నేఁ గోపగించే నంటా నుంటిని
       యెంచి కన్ను లెఱ్ఱ చూడు యిటువంటిదాని నన్ను
       మంచముమీఁదిఁకి దీసి మరిగించితివి

చ. 2: చెక్కు నీవు నొక్కఁగానె చిత్త మెల్లఁ గరఁగితి
       అక్కరతోఁ గాఁగి లియ్య నంటా నుంటిని
       మిక్కిలి నాకాఁక చూడు మీరి వచ్చేదాని నన్ను
       వెక్కసాన నొడి వట్టి వెఱ్ఱిఁ జేసి తిపుడు

చ. 3: వొద్దికి నీవు రాఁగానె వొడఁబడితిఁ గాకిట్టె
       అద్దలించి ఆన వెట్టే నంటా నుంటివి
       గద్దరి శ్రీవెంకటేశ గబ్బి నైననన్నుఁ జూడు
       ముద్దుమోము యిచ్చి కూడి మొక మోడించితివి