పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0356-6 పాడి సంపుటం: 11-336

పల్లవి: ఎప్పుడు మంచిదాననె యిదివో నీకు నాతో
         చెప్ప వద్దు గాని నీకు సెల విచ్చేను నేనూ

చ. 1: నిచ్చలూను నిజ మాడి నీకుఁ బగ యవుకంటే
       రిచ్చల నూరకుండితే రేఁచ నే లయ్య
       హెచ్చి నే నే మనినాను యీరు దియ్యఁ బేను వచ్చు
       కుచ్చితము గాదు లొనఁ గూచుండే నేను

చ. 2: కూరిమి నీవెంట వచ్చి గుండెదిగు లవుకంటే
       బీరాన నే నీడ నుండేఁ బిల్వకు వయ్య
       కేరడాన నట్టె గోర గీరితే నేరు లవును
       నేర నంతేసి యిచ్చలు నిద్దిరించే నేనూ

చ. 3: గక్కువ నీ మోవి యాని గంటు రాఁగించుకంటే
       చిక్కి నీ వశాన నుండే చెనక కయ్యా
       పక్కన శ్రీవెంకటేశ బలిమి నన్నుఁ గూడితి
       వక్కర దీరినమీఁద నలయించ కయ్యా