పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0356-5 సామంత సంపుటం: 11-335

పల్లవి: సిగ్గుపడి నీవు నాతోఁ జెప్ప జాల వింతే కాక
         కగ్గిన నీ విరహము కాన రాదా నాకు

చ. 1: చెక్కుమీఁది చేయే చెప్పీఁ జిత్తములోపలిచింత
       యిక్కడాఁ బతిపై మోహ మేల దాఁచేవే
       లక్కవలెఁ గరఁ గొకలాగుల మాట లాడేవు
       నెక్కొన్న విభావములు నే నెరఁగనా

చ. 2: కన్నులచూపులె చెప్పీ గాయముతో తమకము
       యెన్నికలు నీవు నాతో నేల దాఁచేవే
       పన్ని చెమరించుకొంటా పైపై బొంకేవు నాతో
       వెన్నెల నీసుద్దు లెల్ల వినకున్నదాననా

చ. 3: నెలవినవ్వులె చెప్పీ శ్రీవెంకటేశునిపొందు
       యెలమి నింకా నాతో నేల దాఁచేవే
       వెలయ నాతఁడె నిన్ను వెల్లవిరిగాఁ గూడె
       నిలువు నూరూఁ బండె నీ కెలె వెరపూ