పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0356-3 బౌళి సంపుటం: 11-333

పల్లవి: చాలుఁ జాలు నాతోడి చల మేఁటికి
         ఆలరి వై వుడికించి ఆదరించ నేఁటికి

చ. 1: జల్లజంపు గాఁకతోడ జాగులు సేయ నోప
       అలాడ నేకాంత విరహమే చాలు
       పెల్లున నప్పటి నన్నుఁ బిలవకురా నీవు
       యిల్లిందాఁకా కాఁకఁ బెట్టి యిఁక నేల ప్రియము

చ. 2: పలు మంచిమాటలనె భ్రమఁబడ నోప నాకు
       అలర నీతో వావాద మయినా మేలు
       తల యెత్తి మోము చూపి తగులకురా నన్ను
       వొలసీ నొల్లక వుండి వూరడించ నేఁటికి

చ. 3: బేసబెల్లి కాఁగిటిబిగువుకు నే నోప
       రేసులతో నవ్వు నవ్వే వాసులే మెచ్చు
       ఆస యిచ్చి శ్రీవెంకటాధిప నన్నుఁ గూడితి
       వేసటగా నలయించి వేఁడుకొన నేఁటికి