పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0356-2 దేసాళం సంపుటం: 11-332

పల్లవి: కడుఁ బసిబాలుఁడవు కటకటా
         యెడతాఁకి బడలితి విటువలెఁ గలదా

చ. 1: యేయడనుండి నా యన్న యిపు డాడి వచ్చితివి
       కాయ మెల్లఁ జెమరించెఁ గటకటా
       బాయిట నాడుతా నెంత పరువులు వెట్టితివో
       యీయెడ బుస కొట్టేవు యిటువలెఁ గలదా

చ. 2: విందుల నెవ్వరియింట వేఁడిపా లారగించితి
        కందువ నీ మోవి వొక్కెఁ గటకటా
        మందలించి యా డేడ మడుగులు చొచ్చితివో
        యందు నీమై గరుపారె నిటువలెఁ గలదా

చ. 3: యెన్నెన్నిచోట్లు నీవు యేమి సేసి అలసితో
       కన్నుల నిద్దుర దేరీఁ గటకటా
       పన్నిన శ్రీవెంకటాద్రి బాలుఁడ వై నవ్వేవు
       యిన్ని నీవే యెరుఁగుదు విటువలెఁ గలదా