పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0355-6 సామంతం సంపుటం: 11-330

పల్లవి: తత్తరపు నీలోని తాపము మానితేఁ జాలు
         యిత్తల మీఁదటి పను లెట్టయినాఁ గాని

చ. 1: పక్క నుండఁగానె నన్ను భ్రమసి పేరఁ బిలిచే
       వెక్కడ పరా కైతి వేరా నీవు
       తక్కక నీవు మోహించేదాని గుఱతు చెప్పరా
       యిక్కడికిఁ దోడి తెచ్చే యె గ్గైనాఁ గాని

చ. 2: ఆకు మడి చియ్యఁగానె అవ్వలఁ జేయి చాఁచేవు
       యేకడ వున్నది చిత్త మేరా నీవు
       ఆకెతో నీకు నే మని ఆతుమ చెప్పవలసె
       చేకొని నాతోఁ జెప్పర చెప్పి వచ్చేఁ గాని

చ. 3: నేమాన నేఁ గూడఁగాను నిలువెల్లఁ గరఁగితి
        వే మాఁట దలఁచుకొంటి వేరా నీవు
        యేమిర శ్రీవెంకటేశ యెవ్వతె జగడించెరా
        కామించి యాన తీరా వొక్కటి సేసేఁ గాని