పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0355-5 శ్రీరాగం సంపుటం: 11-329

పల్లవి:ఇంక నెన్నఁడె నీ యెమ్మెలు నేఁడు గాక
        అంకెల నాతఁడు నీ వాడినట్టె యాడఁగా

చ. 1: చెల్లదా నే కేమి నేఁడు చెలువుని వలపించి
       యిల్లు వెళ్లకుండాఁ జేసి యింత సేసితి
       పల్లదాన నన్పటిని పంత మాడే వేమి దొడ్డె
       కెల్లు రేఁగి ఆతఁడు నీ కింకరుఁ డై యండఁగా

చ. 2: తగదా నీ కే మతనిదండనుండి సవతులఁ
        బగలు సాదించ నీవె పనిగొనను
        నగ నేలె యాతఁడు నీ నటనకుఁ దగినట్టు
        చిగులుతా సారె సారెఁ జెప్పినట్టు సేయఁగా

చ. 3: మేలు గాదా యిందరిలో మించి శ్రీవెంకటేశ్వరు
       నాల వై మావంటివారి నాదరించేవు
       సోలుచు నీ రాజసాలు చూపేవు నీ కెదు రేది
       వేళ గాచి యతఁడు నీ వెంట వెంట రాఁగా