పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0355-4 బౌళి సంపుటం: 11-328

పల్లవి: మేరకు మేరే కాక మీర నేఁటికే
         నేరుపులు చాలు జాలు నెరవేరెఁ బనులు

చ. 1: వద్దు వద్దేమీఁ దడవకురే మీరు వా
       రిద్దరు లోన నుండఁగ నేలే దోసము
       కొద్ది మీరి దగ్గరితే కూళ వందురు
       తిద్ద నేల పను లెల్లఁ దీరినమీఁదటను

చ. 2: చేకొని మీ రెరుకలు సేసుకొందురా వా
       రేకత మయినవేళ యేలె దోసము
       కాకు నేయఁ బోతే నన్నే కల్లందురు
       లోకమువారే చెప్పేరు లోలోనే వారికి

చ. 3: తెక్కులవాకి లిప్పుడే తెరవకురే వా
        రిక్కువఁ గరఁగేవేళ యేలే దోసము
        మొక్కి శ్రీవెంకటపతి మొకమోట నన్నుఁ గూడె
        నెక్కుడు మా టేల పంత మిచ్చినమీఁదుటనూ