పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0355-3 పాడి సంపుటం: 11-327

పల్లవి: సిగ్గుగ లాఁటదానికి చెప్పించుకో నింత యేల
         దగ్గరి వుండుటె చాలు తడవకు మమ్మును

చ. 1: వొలిసీ నొల్లని నిన్ను వొడివటి తీయుకంటే
       అలిగి నేఁ బవళించు టదియే మేలు
       పిలువకుండఁగ నీవు పెనఁగి పై బడుకంటే
       తల వంచుకొని వుండే తడవకు మమ్మును

చ. 2: కడు రాజసపు నీతో కలకల నవ్వుకంటే
       చిడుముడిఁ జిన్నఁ బొయ్యే చింత మేలు
       జడిసి వుండిన నీతో చనవు చెప్పుటకంటే
       తడతాఁకులఁ బొరలే తడవకు మమ్మును

చ. 3: కపటాలు సేసే నిన్ను కాఁగిలించుకొనుకంటే
       నెపముతో నూరకుండే నీటే మేలు
       యిపుడె శ్రీవెంకటేశ యేకమై నన్నుఁ గూడితి
       తపము ఫలించె నిఁకఁ దడవకు మమ్మును