పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0355-2 రామక్రియ సంపుటం: 11-326

పల్లవి: చెప్పరమ్మ మీరు బుద్ది చెలులాల
         యిప్పటికోపము మీఁద నిట్టె వుండీనా

చ. 1: చిగురుఁబెదవి వంచి సిగ్గులనె గొణఁగీని
       వెగటునఁ బతి దన్ను వేఁడుకోఁగాను
       నగుతాఁ బయ్యెదకొంగు నాథుఁడు పట్టఁ బట్టఁగ
       జగడించి లోని కేఁగీ సమ్మతించ కదివో

చ. 2: సరుస నవ్వులు దీర సతి యాన లెల్లఁ బెట్టీ
       బెరసి విభుఁడు దన్ను బిలువఁగను
       పరిమిళము లతఁడు పైపై బూయ బూయఁగ
       తెరచీరఁ దుడిచీని తీసి తీసి యదివో

చ. 3: చెమట చెక్కున జార సిరసు వంచుకొనీని
       సుముఖుఁడై శ్రీవెంకటేశుఁడు గూడఁగ
       అమరఁ గమ్మటి నాతఁ డాయము లంట నంటఁగ
       తమితోఁ దిప్పించుకొంటా తాఁ దా నేర్పీ నిదివో