పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0354-4 దేసాళం సంపుటం: 11-322

పల్లవి: ఊరి మగనాండ్లకు నుండఁ బాసెను
         యీరితి నన్నింత సేసె నే మందు నమ్మా

చ. 1: వొల్ల ననఁగానె వచ్చి వొక టొకటె యాడి
       చెల్లఁ బో వీఁడు నా చేయి వట్టీని
       పల్లదపు వీనిచేతి బాధకుఁ గాక నేను
       యిల్లిదె నే లోనయితి నిఁక నేఁటి దమ్మా

చ. 2: తల వంచు కుండఁగానె దగ్గరి వద్దఁ గూచుండి
       చలి వాయ మాట లాడీ జాణతనాలు
       చలపాది వీనిచేతి చండకు నోపక నేను
       చెలరేఁగి కాఁపురము సేసితి నో యమ్మా

చ. 3: యింటివారికి వెరవఁ డెదుట నవ్వులు నవ్వి
       చంటిమీఁద నొరగుచు సట సేసీని
       వెంటఁ బాయ కిది వో శ్రీవెంకటేశ్వరుఁడు గూడె
       దంట నై వీనిమాయఁ దగిలితి నమ్మా