పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0354-3 బౌళి సంపుటం: 11-321

పల్లవి: తొల్లిటివలెనా నీవు దొర వైతివి
         యెల్లవారుఁ జూడఁగా నేనే మందు నిఁకను

చ. 1: యేరా నే వద్ద నుండఁగ యెవ్వతెదిక్కు చూచేవు
       మేర మీర దొరకొంటి మెల్ల మెల్లనె
       తేరా నా వుంగరము తెలిసితి నీ గుణము
       వోరి నీతో జగడించ నోపరా నే నిఁకను

చ. 2: నా యెదురుకట్టులనె నవ్వఁ బొయ్యే వాపెతోడ
       యీయెడ నప్పుడె యెంత కెత్తుకొంటివి
       చేయి విడువర నీతో చెలిమి నా కయి వచ్చె
       చాయలు నే వెంగె మాడఁ జాలరా నిన్నిఁకను

చ. 3: యిట్టె నా యింటనుండి యిల్లురికి మాటాడేవు
       తిట్టీ నంటా నాపె నిదె సందుగా
       గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విదె నన్ను
       పట్టినచలము చెల్లె బ్రదుకరా యిఁకనూ