పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0354-2 ముఖారి సంపుటం: 11-320

పల్లవి: లోలో నాతనిచేఁత లోక మెఱఁగదు గాని
         యేలీల నన్నే దూరే రేమి నేతు నమ్మా

చ. 1: చిఱునవ్వు నవ్వఁగ చేయి వట్టీ నాతఁడు
       గుఱిగా నే వద్దంటేఁ గోప మనేరు
       అఱిముఱిఁ దానె సాదు అందిరికిఁ జూడఁ జూడ
       యెఱుకతో నేనే వెఱ్ఱి నేమి సేతు నమ్మా

చ. 2: వూరకె న న్నాతఁడు వొడివట్టి తీసీని
       తారి నే రా నోప నంటేఁ దప్పు సేసేరు
       వారక తానె మంచివాఁడు విన్న కన్న వారి
       కీ రీతి నే నిష్ణూరి నేమి సేతు నమ్మా

చ. 3: కడ నేఁ గూచుండఁగాను కాగిలించుకొనీఁ దాను
       జడిసి నే నుండితే రాజస మనేరు
       విడువక నన్నును శ్రీవెంకటేశుఁ డిదె కూడె
       యెడసి నే నుండఁ జాల నేమి సేతు నమ్మా