పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0354-1 బౌళి సంపుటం: 11-319

పల్లవి: చెక్కిటఁ బెట్టెను చేయి చిత్తములో నదే నుయ్యి
         యెక్కడికిఁ బోరాదు యిఁక నీచిత్తము

చ. 1: జవ్వనపు పైతరపు సతితురుము బరవు
       యెవ్వరు విలిచిన నెర వెరపు
       యివ్వల నీ విదె చూడు మిదివో నెమ్మోవివాడు
       రవ్వ లాయ నీ వలపు రావయ్య యిఁకను

చ. 2: చిగురుఁబులకపైరు చిత్తడిచెమటనీరు
       పగటుగుబ్బలమీఁద పయ్యద జారు
       నగకు మాతో నింత నాతికి నంతా వింత
       వెగటాయ నీమాయ విడవయ్య చలము

చ. 3: కాయములోని యలపు కనుఁగొనల సొలపు
       చాయల సన్నలలోని సారె బులుపు
       యీయెడ శ్రీవెంకటేశ యింతిన నీవు గూడఁగా
       తోయ రాదు నీ చనవు తోడఁ దోడ నిదివో