పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0353-5 రామక్రియ సంపుటం: 11-317

పల్లవి: మగవాఁడు వలచితే మరి చేతఁ బట్ట రాదు
         తగుదునా నే నీకు తమకించే విపుడు

చ. 1: ఆన వెట్టకుర నీ వన్నట్టె వినేఁగాని
       మాన వెంత చెప్పినా నీ మంకువోజలూ
       కాని మ్మన్నా మొక్కేవు కాఁ గాని దోసాన
       నే నెంత నీ వెంత నీకు నేబాఁ తైతిఁగా

చ. 2: చెక్కు నొక్కకుర నీవు చెప్పినట్టే సేసేఁ గాని
       యిక్కడ నవ్వేవారి నెఱఁగ వోరి
       యిక్కువ లంట వచ్చేవు యెంగి లని చూడవు
       చక్కనివాఁడవు నే నీసాటికి రాఁ గలవా

చ. 3: పొగడకురా నేనీ పొందులు విడువఁ గాని
       నగవులు మానవు నాతో నీవు
       తగు లై శ్రీవెంకటేశ తతి నన్నుఁ గూడితివి
       మొగము చూచే వింకా మోహ మింత గలదా