పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0353-2 రామక్రియ సంపుటం: 11-314

పల్లవి: మేరతో నే నుండఁగాను మీచేతి బాద బెట్టు
         వూరకున్నవారి నేల వుడికించేరే

చ. 1: వొట్టి పతికిఁ బాదము లొత్తి వచ్చితి నిందాఁకా
       యిట్టె యలిగితి నంటా నేల పోరేరే
       వెట్ట దీరఁగ సురటి విసరితి నాతనకి
       చిట్టకాన కింకా నేమి సేయు మనేరే

చ. 2: సన్నతో నేనిందాఁక సముకాననే వుంటి
       చిన్నఁబోతి నంటా నేల చేయి వట్టెరే
       మున్నె యాతనూడిగాన ముక్కు చెమట జారితే
       కన్నీరు రాలె నంటా గడియించే రేటికే

చ. 3: ముక్కువ శ్రీవెంకటేశు మాటలు వింటి నిందాఁక
       వొక్కటి గమ్మంటా నేల వొడి వట్టేరే
       అక్కరతో నాతఁడె ఆదరించి నన్నుఁ గూడె
       మొక్కనైతి నంటా నేల మొరఁగు లాడేరే