పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0353-1 దేసాక్షి సంపుటం: 11-313

పల్లవి: అప్పటి మానవుబీరాల దేమే నీవు
         యిప్పు డేమి దప్పి పోయ నిఁకఁ జూడ రాదా

చ. 1: యేతు నీకుఁ గలిగితే నెందైనాఁ జూపుదు గాక
       ఆతని నావద్దఁ దిట్టే వదేమే నీవు
       నీ తెరువు వచ్చితిమా నీ కేమి గారణమె
       తోతో నా రమణుని దూరుదు గాక

చ. 2: బలువు గలిగితేను బతుకుదు గా కతని
       అలమేవు నా యెదుట నదేమే నీవు
       తలవే నిన్నుఁ దడవ దగ్గరి నాయకుని
       వలసినట్టు సేసితే వద్దనేవా నీవు

చ. 3: వాసి నీకుఁ గలితేను వద్దఁ బెట్టుకుందు గాక
       ఆస పడేవు నాపతి కదేమే నీవు
       యీసరి శ్రీవెంకటేశుఁ డిందరిఁ గూడినమీఁద
       గోస నాస నేయఁ బోతే కోప మేలే నీకు