పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-6 ముఖారి సంపుటం: 11-312

పల్లవి: ఎవ్వరికి బుద్ది చేప్పే నెఱఁగ మరి
         యివ్వల నే నుండదాన నెఱఁగ మరి

చ. 1: చెక్కు చెలిచేత నుండె నింత మదిలోన నుండె
       యిక్కడికి నే వచ్చితి నెఱఁగమరి
       పక్కన నంపవు మమ్ము పదరి నీవు రావు
       యెక్కు నీ చిత్త మొట్టో యెఱఁగ మరి

చ. 2: వుమ్మచెమటలఁ దోఁగె నువిద కాఁకల రాఁగె
       యిమ్మల నన్నీడ కంపె నెఱఁగ మరి
       కొమ్మసుద్దు లడిగేవు గుట్టునఁ దల వంచేవు
       యెమ్మె లేమి సేసేవో యెఱఁగ మరి

చ. 3: యిందాఁకాఁ దమకించె యింతి యిట్టె పవ్వళించె
       యిందున్నదాన నేను యెఱఁగ మరి
       అంది శ్రీవెంకటేశుఁడ ఆడకె నీవు విచ్చేసి
       యిందుముఖిఁ గూడితివి యెఱఁగ మరి