పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-5 ఆహిరి సంపుటం: 11-311

పల్లవి: కాదనేనా నీమాట కానీ లేవే
         నాదె నేమి చూచేవు నవ్వేఁ గానీ లేవే

చ. 1: నమ్మించి నీవు వానినయగారాలు చెప్పఁగ
       కమ్మి నామై కాఁక రేఁగె కానీ లేవే
       నెమ్మది వాని నిజాలు నీవు గల్లలాడే వటే
       అమ్మరో ఆన వెట్టకు మట్టె కానీ లేవే

చ. 2: పిలిచీ ననుచు వాని ప్రియము నీవు చెప్పఁగ
       కలిగెఁ బెద్దరికము కానీ లేవే
       నెల వై వానిచేఁతలు నీవు నాకు దాఁచే వటే
       అలుక లన్నియుఁ దీరె నట్టె కానీ లేవే

చ. 3: శ్రీవెంకటేశ్వరుని చేతికి నీ వియ్యఁగాను
        కైవస మయితి నట్టె కానీ లేవే
        నీవల్లనే కాదా నే మిద్దర మొక్క టైతి
        మావటించి యిఁకఁ బాయ మట్టె కానీ లేవే