పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0352-3 శ్రీరాగం సంపుటం: 11-309

పల్లవి: ఏఁటికి జాగులు సేసే రింకా మీరు
         చాటి చెప్పి పతి నిట్టె జరయరమ్మా

చ. 1: వలచినవలపులు వనితమేనిమీఁదికి
       పులక లై మొలచె నిప్పుడు చూడరే
       యెలమిఁ గాఁక లనేటియెన్నులు వెళ్ళక తొల్లె
       నెల వై చలిమందులు నించరమ్మా

చ. 2: చిత్తములో చింత లెల్ల చెమట లై సతిమేన
       జొత్తులు గారఁగఁ జొచ్చె జూడరె యిది
       యెత్తనతమకముల యేరులు వారక తొల్లె
       వొత్తి పువ్వుఁబొట్లాల నొగిఁ గాఁచరమ్మా

చ. 3: కడ లేనిజవ్వనము కలికి నిట్టూరుపులై
       విడువక చెలరేఁగి వేఁచఁ జొచ్చెను
       తొడరి విరహ మనేదుమ్ములు రేఁగక తొల్లె
       అడరి శ్రీవేంకటేశుఁ డాదరించె నమ్మా