పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0351-6 వరాళి సంపుటం: 11-306

పల్లవి: ఎంత వని కెంత వని యిది యేఁటిదే
         పంతమె సతుల కిది పాలతోడఁ బోసిరో

చ. 1: నవ్వుతా నే నన్నందున నాలి నెగ్గు సేసుకొని
       యివ్వల నట్టె మాటాడే విది యేమె
       పువ్వువంటి యాఁట దైతేఁ బొగరు ముంపుఁదనమె
       నివ్వటిల్లునో కాక నీకే తెలసునే

చ. 2: తప్పక చూచినందుకే తగఁ గోపము సేసుక
       కొప్పు దువ్వినఁ గసరుకొనే వేమే
       చిప్పిల జవ్వని యైతె చెంది యాడ లేని వాసు
       లెప్పు డెం దుండి వచ్చునో యెరఁగమే నేము

చ. 3: సరస మాడినందుకె చాల నలుక సేసుక
       వొరసి చేయి వట్టిన నులికే వేమే
       యిర వైన శ్రీవెంటేశుడ నిన్నుఁ గూడితి
       గరిమె నిచ్చగించితి కడు మేలె నీవు