పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0351-5 ఆహిరి సంపుటం: 11-305

పల్లవి: ఇందుకా యింత సేసితి విందాఁకాను
         అంది పొంది నీవే బదు కాఁటదాన నేనూ

చ. 1: వొలిసీ నొల్లనివాఁడ వూరకే ఆ సియ్యనేల
       పొలసి అప్పుడే నన్నుఁ బొమ్మన రాదా
       కులికి నేఁ గొసరఁగఁ గోమటిమేనరికమా
       నెల వై సుఖాన నుండు నీవే వొక్కఁడవే

చ. 2: మనసు రానివాఁడవు మాతో నవ్వఁగ నేల
       అనువు గాదని విడనాడఁగ రాదా
       చనవున నిన్ను నాఁగ పరిఁ బత్రసాలామా
       యెనయుచు నేకరాజ్య మేలవయ్యా నీవే

చ. 3: మాయలు సేసేవాఁడవు మమ్ము జాలిఁ బెట్టనేల
        రాయి డేల మాయింటికి రా నన రాదా
        ఆయ మంటి కూడితివి అలమేలుమంగ నేను
        పాయపు శ్రీవెంకటేశ బడి నుండు మిఁకను