పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0351-4 సాళంగనాట సంపుటం: 11-304

పల్లవి: మొక్కరో మొక్కరో మీరు మోమునఁ గళలు దేరె
         యెక్కువ శ్రీవెంకటేశుఁ డింతులో వాఁడె

చ. 1: తేరుమీఁద నెక్కీ హరి దేవుళ్లు దానును వాఁడె
       భోరునను దేవదుందుభలు వాఁగగా
       తోరపుమోఁకులు వట్టి దొరలు బ్రహ్మదు లెల్ల
       ధీరతఁ దీశే రదే తిరువీధులందును

చ. 2: వేడుక రథముమీఁద వెలసే శ్రీపతివొద్ద
       ఆడేరు పాడేరు అచ్చర లెల్ల
       నీడెపు సెలవులతో వెలఁదులతో హరి
       యీడు లేక యేఁగి వచ్చీ నింటింటి వాకిటను

చ. 3: శ్రీవెంకటేశుఁడు వాఁడె చేరి యలమేలుమంగ
       సావధానమున సరసము లాడఁగ
       దేవాసనం బెక్కి తేఁకువ నారగింపులు
       వావిరిఁ జేకొనో వాఁడె వాడవాడలను