పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0351-3 బౌళి సంపుటం: 11-303

పల్లవి: ఎంతచెప్పినా మాన విదేరా నీవు
         కాంత లైన వారి నింత కాకు సేతురా

చ. 1: యిట్టె చన్ను లంటకుర యిస్సీ యిందరుఁ జూడ
       వొట్టి నీవద్దికి వచ్చి వున్న నేరమా
       తిట్టుదుఁ జుమ్మీ నాతెరువు వచ్చితేఁ గన
       గుట్టున నుండుదు గాని కొం తైన నోరి

చ. 2: తొడ మీఁద వేయకుర తోతో యిందరు నవ్వేరు
       యెడయక దగ్గరితే నిదే పనా
       కడు గోపిఁ జుమ్మీ నేను కలదె విన్నవించితి
       బడలించకుర నన్ను పలుమారు నోరి

చ. 3: పచ్చిమాఁట లాడకుర పడఁతు లెల్లా వినేరు
       అచ్చ మై నే నీతో మాట లాడినందుకా
       యిచ్చగించి శ్రీవెంకటేశ నిన్నుఁ గూడితి
       నిచ్చ నలమేలుమంగ నేఁ జుమ్మీ వోరి