పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0351-2 పాడి సంపుటం: 11-302

పల్లవి: పిలువరె యింకాను ప్రియము చెప్పేఁ గాని
         చల మేల నెరపీనె సారెకుఁ దానూ

చ. 1: తప్పు లెంచఁ బని లేదు తానె నే నైనచోట
       కప్పురము గొమ్మనవె కపటా లేల
       యిప్పుడు నాప్రియములు యిందాఁకా నియ్యకొనె
       అప్పటి నేల వున్నదె ఆడనె తాను

చ. 2: కోపగించఁ బని లేదు కూడితి మిద్దర మీడ
       చూపులఁ జూడు మనవె సూడుఁబా డేల
       యీ పొద్దుదాఁకా మాట లియ్యకొన్నట్టె వుండె
       యేపునఁ దెరలోని కే లేఁగీనె తాను

చ. 3: ఆన వెట్టఁబని లేదు ఆయా లిద్దరికి సోఁకె
       పూని కూచుండు మనవె బూటకా లేలా
       నేనె శ్రీవెంకటపతిఁ దానె యలమేలుమంగ
       మానక కూడితి మిఁక మంచ మెక్క నేఁటికే