పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0351-1 గౌళ సంపుటం: 11-301

పల్లవి: అటమీఁద నయినట్లయ్యీఁ గాని
         సట లింతే తాముఁ దామే సంతము లయ్యేరు

చ. 1: పలికినంతే చాలు పచ్చి సేయకురే యింతి
       నలుక దేరినమీఁద నడిగేఁ గాని
       చెలవుఁ డీసుద్ది వింటే చేర వచ్చునో రాడో
       కలయిక కిద్దరినిఁ గదియింత మిపుడు

చ. 2: నవ్వినపాటే చాలు నానఁ బెట్టకురే మీరు
       నెవ్వగ దీరితే బుద్ది నేనే చెప్పేను
       అవ్వల నీపా టైతే నాతనిఁ దేరుచ రాదు
       దవ్వుల నిద్దరి సమతారుకాణ నేతము

చ. 3: తానెచూచినంతే చాలు తరువుల వెట్టకురే
       మేనులు సోఁకినమీద మించీఁ గాని
       ఆనుక శ్రీవెంకటేశుఁ డలమేలుమంగఁ గూడె
       పానిపట్టి యింతలోనే పంగింత మిపుడు