పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0350-6 వరాళి సంపుటం: 11-300

పల్లవి: మంచివాఁడ వౌదవయ్య్వ మానిన అటుండఁగాను
         మంచ మెక్కి చెలులతో మాఁట లేటి వయ్యా

చ. 1: కామిని నీవు రాఁగానె గక్కన లేచి నిలిచి
       దోమతెరమాటు కేఁగి తొంగి చూచీని
       కోమల మయినసతిఁ గూచుండు మనమయ్య
       జా మాయ నప్పటినుండి చాలు నీ సరసము

చ. 2: తప్పక నీవు చూడఁగ తరుణి సిగ్గున నవ్వి
       వొప్పుగాఁ దల వంచుక వూర కున్నది
       ముప్పిరి నీచేత నాకెమో మెత్తి మాటాడవయ్య
       యిప్పుడు డింతవడి యాయ నేఁటికీ సరసము

చ. 3: కొంగువట్టి తియ్యఁగాను కోమలి మేను మరచి
       వుంగిటి నీ మేనిమీఁద నొర గున్నది
       అంగవించి శ్రీవెంకటాదిప కూడితి విట్టె
       చెంగట నలమేల్‌ మంగచేతి దీ సరసమూ