పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0350-5 మంగళకౌశిక సంపుటం: 11-299

పల్లవి: నావలెనే నీవ నంటా నమ్మితి నేను
         దేవర వవుత యింత తెలియరా నేను

చ. 1: మంతనాన నాడినట్టి మాఁట లాకెతోఁ జెప్పి
       పంతానకే నవ్వేవు పలుమారును
       చింత మది దరికొని శిరసున వెళ్లఁ జొచ్చె
       యింతే శవుతఁ దొల్లి యెరఁగరా నేను

చ. 2: నే నిచ్చినపదకము నీ వాకె మెడఁ బెట్టి
       పూని యెమ్మెలు చేసేవు పూటఁ పూఁటకు
       కానీ లేరా అందు కేమి కాయ మెల్లా నుడికీని
       యీ నీ గుణము నాఁడె యెంచ నైతి నేనూ

చ. 3: పీఁటమీఁద నిన్నుఁ దెచ్చి పెట్టుకొంటే నీ వాపెను
       పాటించి వద్ద బెట్టుక పాయఁగ లేవు
       మాటాడి నే నలమేలుమంగ నంటాఁ గూడితివి
       నీటున శ్రీవెంకటేశ నేరరా నేను