పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0350-3 శంకరాభరణం సంపుటం: 11-297

పల్లవి: కడవారు నవ్వేది కానవు గాక
         గొడవల మమ్ముఁ జూచి గుద్దిరము లేఁటికే

చ. 1: నిండుఁ బరితాపమున నీ వేల సొలసేవు
       అండనె నాతో నవ్వే వాతనిఁ జూచి
       చండి పెట్టి మగవాని సాదించి వలవు మంటా
       బండు సేసే యాఁటదాని బదు కేఁటి బదుకే

చ. 2: నిక్కి చూచే యాతిని నీ వేల కోపగించేవే
        మక్కువ నతఁడు నాతో మాఁట లాడఁగా
        వొక్కతెపై తరితీ ఫై వుండెటివిభునిఁ జూచి
        గుక్కిళ్లు మింగేదానిగుణ మేఁటి గుణమే

చ. 3: బలిమి శ్రీవెంకటేశుఁ బగ లేల చాటేవే
       కలసి యాతఁడు నన్నుఁ గాగిలించఁగా
       పిలువని పేరటము ప్రియునివద్దకి వచ్చి
       చలముకొనేటిదాని చల మేఁటి చలమే