పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0349-6 దేసాక్షి సంపుటం: 11-294

పల్లవి: అప్పటి బీరముతోనె అట్టె వుండుదువు గాక
         పిప్పి సేసినందుమీఁదఁ బిసుకఁగ వత్తురా

చ. 1: వొట్టి నీతో మాటలాడ నొల్ల నొల్ల ననఁగానె
       పట్టేవు నాకొంగు బలువా యిది
       చిట్టకాన వా దడిచి సిగ్గు గలవాఁడ వట్టె
       గుట్టున నుందురు గాక కొసరంగ వత్తురా

చ. 2: ఆరయ నేఁ గోపగించి ఆన లెల్లఁ బెట్టఁగానె
       సారె నాతో నవ్వేవు చలమా యిది
       యేర నాతోఁ బంత మాడి యింటికి రా నన్నవాఁడ
       వూరకే వుండుదు గాక వొరయంగ వత్తురా

చ. 3: తక్కరి నీసుద్దులకు తలవంచు కుండఁగాను
        మొక్కేవు నాకు నింకా మోహమా యిది
        యెక్కువ శ్రీవెంకటేశ యింత బత్తి గలవాఁడ
        వక్కరతో నుందు గాక ఆగడాలు వలెనా