పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0349-5 ముఖారి సంపుటం: 11-293

పల్లవి: ఎంత వడి కెంత వడి యేమి దలఁచుకొంటివో
         యింత వొలిసీ నొల్లము లెరఁగ దాచెలియా

చ. 1: అప్పుడె మావిన్నపము లవధరించినవాఁడ
       విప్పు డేల అడిగేవు యిం కొక్కమాఁటు
       వుప్పరిగలోన నుండి వువిద నిన్ను రమ్మని
       చెప్పి రమ్మన్నది యింతే చిక్కిన వెరఁగము

చ. 2: కచ్చుపెట్టి యల్లప్పుడె కాను కందితివి మాచే
       వచ్చినప నడిగేవు వడి నిప్పుడు
       విచ్చేయు మనుచు నింతి వెస గొంగువట్టు మని
       యిచ్చె మాకు సెల వింతే యి దేమి నెరగఁదు

చ. 3: ముందె నేము రాఁగాను ముంచి నవ్వినవాఁడవు
       యిందుముఖిసుద్దు లిప్పుడే లడిగేవు
       కందువ శ్రీవెంకటేశ కలసె నాపె విచ్చేసి
       విందు నీకుఁ జెప్పు మనె వేరు సేయ నేరదు