పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0349-4 కేదారగౌళ సంపుటం: 11-292

పల్లవి: ఆన లింకాఁ బెట్టుకొనే వౌరా నీవు
         కానవచ్చె నీచేఁతలె కనుకోరా నీవు

చ. 1: కొప్పుపువ్వు లవె కందె గురుతుచెమట చిందె
       అప్పటినాతో బొంకే వౌరా నీవు
       దప్పి దేరీఁ గెమ్మోవి తగిలెఁ గన్నులకావి
       తప్పించుకొనేవు మాఁట తగురా నీవు

చ. 2: చిటిలె గందపుఁబూఁత చెక్కు లెల్లఁ గడు రోఁత
       అటమటించేవు నన్నే అవురా నీవు
       నిటలాన నలకలు నిండె మేనఁ బులకలు
       యిటివంటివొ ట్లేల యేమిరా నీవు

చ. 3: ముక్కున నిట్టూర్పుగాలి మొగాన నిద్దురజోలి
       అక్కడనుండె తెచ్చితి వౌరా నీవు
       యిక్కడ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
       మిక్కిలి జాణ వౌదువు మేలురా నీవు