పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0349-2 దేసాళం సంపుటం: 11-290

పల్లవి: సాకిరి మీరే సుండి సతులాలా
         యీకడ నన్నే నేరా లెంచ రాకు రమ్మా

చ. 1: వుడివోని తమకాన వొక టొక టాడ వచ్చీ
       తడవము తాఁకము తా నేమే వీఁడు
       నడుమ నే నే మన్న నానోరె గనమే
       వుడుకు నూరుపుతోడ నూరకుండే నమ్మా

చ. 2: చిత్తిణిగుణముతోడ చేతులు చాఁచఁగ వచ్చీ
       బత్తి గలవానివలె పై పై వీఁడు
       అత్తినేఁ గోపగించితే నందరు నన్నే దూరేరు
       కొత్త నివ్వెరగుతోడఁ గూచుండే నమ్మా

చ. 3: యెవ్వరి ముందర నైన యెమ్మెకే నవ్వఁగ వచ్చీ
       పవ్వళించాఁ బోనీఁడు పదరి వీఁడు
      యివ్వలఁ గడపరాయఁ డిదె శ్రీవెంకటగిరి
      నివ్వటిల్ల నన్నుఁ గూడె నెయ్య మైతి నమ్మా